నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అవయవాలు అన్నీ బాగానే పని చేస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. గుండెలో క్లాట్ అవడం, కాస్త ఇంటర్నల్ బ్లీడింగ్ అవడం వల్ల స్టంట్ వేయడం కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం వైద్యులు స్టెప్ బై స్టెప్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. మాసీవ్ హార్ట్ అటాక్‌తోనే తారకరత్న కుప్పకూలినట్లు తెలిపారు.
హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత మిరాకిల్ జరిగి హార్ట్ బీట్ స్టార్టయిందని తెలిపారు. బెటర్ ఐసీయూ కేర్ కోసం నారాయణకు హృదయాలయకు తీసుకొచ్చినట్లు తెలిపారు. మళ్లీ అటాక్ వచ్చే అవకాశం ఉన్నందున డాక్టర్లు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. చికిత్సకు కొంతవరకు తారకరత్న స్పందిస్తున్నారని తెలిపారు.
ఒకసారి గిచ్చితే కొద్దిగా స్పందించారని అన్నారు. అభిమానుల దీవెనలు, ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు. ఇక, శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తారకరత్న చికత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు. కాగా, తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్ ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నార.