బాలకృష్ణ కెరీర్ లో మైలురాయి లాంటి చిత్రం ముద్దుల మావయ్య. 1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సీత, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తో బాలకృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యారు. కె. వి. మహదేవన్ సంగీతం సినిమా సక్సెస్ లో భాగం అయ్యింది. మామయ్య అన్న పిలుపు, మా ఇంటా ముద్దులకు పొద్దుపొడుపు అంటూ సాగే ఈ పాత ఇప్పటికి ఎదో ఒక చోట వినిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రం నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో గతంలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేయడం తో ఈ మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
31 yrs for Golden Jubilee Hit in Natasimha #NBK, Kodi Ramakrishna, Bhargav Arts S Gopal Reddy combination, #MuddulaMavayya (07/04/1989) Music by KV Mahadevan
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు..
చెంగు చెంగు ముద్దాడంగ..https://t.co/M659W7TaH0 pic.twitter.com/YkRQYIcyOs— BARaju (@baraju_SuperHit) April 7, 2020