ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2001లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఖుషి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు అదే ఏడాది వచ్చిన నరసింహనాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది.
నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యూత్ ని ఆకట్టుకున్న ఖుషి, మరోవైపు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నరసింహనాయుడు… ఈ రెండు ఓకే ఏడాది రిలీజ్ అయ్యాయి. కానీ అప్పటి లెక్కల ప్రకారం ఖుషి సినిమా పై నరసింహనాయుడు పై చేయి సాధించింది. అదెలా అనుకుంటున్నారా!
హీరో గోపీచంద్ నాన్న డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవో తెలుసా ?
అప్పటి లెక్కల ప్రకారం… ఖుషి సినిమా 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నరసింహనాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే ఖుషి సినిమా 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నరసింహనాయుడు 22 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక బడ్జెట్ విషయానికొస్తే ఖుషి సినిమాకు 2.5 కోట్లు ఖర్చయింది. నరసింహనాయుడు సినిమాకు రెండు కోట్లు మాత్రమే ఖర్చు అయింది.
సింహాద్రి కథ పుట్టింది ఆ స్టార్ హీరో సినిమా నుంచట!!
ఇలా ఏవిధంగా చూసినా… నరసింహనాయుడు సినిమా ఖుషి పై పైచేయి సాదించినట్టే కనిపిస్తుంది. ఇదే కాకుండా బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.