శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. హిందూపురానికి చేరుకున్న బాలయ్యకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. హిందూపురంలోని వరద పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు.
వరద ముప్పు ప్రాంతాల్లో భోజన వసతి కల్పించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.
ఇటీవల కురిసిన వర్షాలు కర్ణాటక ప్రాంతం నుండి ఉదృతంగా వస్తున్న నీటి ప్రవాహంతో చెరువులు నిండి మరవలు పొంగి రాకపోకలు స్తంభించాయి. చౌడేశ్వరి కాలనీ,త్యాగరాజ నగర్,ఆర్ టి సీ కాలనీ వాసులు మంచినీటికి,బోజనం కి (1/2) pic.twitter.com/3pPoUXjbux
— manabalayya.com🌟 (@manabalayya) October 16, 2022
మోకాల్లోతు వరదనీటిలో నడుస్తూ స్థానికులను పరామర్శించారు బాలయ్య. వరదలతో తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్నారు అక్కడి ప్రజలు. తమను ఆదుకోవాలని కోరారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు బాలకృష్ణ. వరద ఉధృతి తగ్గాక నష్టపరిహారంపై అధికారులతో మాట్లాడతామన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే.. తన సొంత డబ్బులను ఖర్చు చేస్తానని సమకూర్చుతానని బాలకృష్ణ తెలిపారు. అంతేకాకుండా వరదల ముంపు ప్రాంతాలైన చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ కాలనీ, ఆర్టీసీ కాలనీ వాసులకు భోజన వసతి, మంచినీరు కల్పిస్తానని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వ వచ్చినప్పటి నుంచి హిందూపురం రోడ్లపై ఒక గుంత కూడా పూడ్చలేదన్నారు. అలాగే హిందూపురం అభివృద్ధి కోసం ఎక్కడున్నా పాటు పడతానని తెలిపారు బాలకృష్ణ.
కాగా సత్యసాయి జిల్లాలోని హిందూపురం వరదల్లో చిక్కుకుంది. కుట్మూరు చెరువు పొంగిపొర్లుతుండడంతో రహదారులన్నీ నీటమునిగాయి. వరద ఉధృతితో హిందూపురం నుంచి అనంతపురం, కదిరి ప్రాంతాలకు నాలుగు రోజులుగా రాకపోకలు తెగిపోయాయి. హిందూపురాన్ని ఆనుకుని ఉన్న చౌడేశ్వరి కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లు చెరువులను, జలపాతాలను తలపిస్తోంది. ఊరిలో జలపాతంలా మారిన చెరువు ప్రవాహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీసంఖ్యలో చేరుకున్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా వరదనీటిలో ఉల్లాసంగా గడుపుతున్నారు.