బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు సమరసింహా రెడ్డి, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ హిట్ లను అందించారు దర్శకుడు బి.గోపాల్. అయితే బాలయ్య మళ్లీ బి.గోపాల్ తో సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య స్పై క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని సమాచారం.
అయితే బాలయ్య శైలిలోనే సినిమా సాగుతున్నప్పటికీ కాస్త కొత్తగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుందట. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా తో పాటు ఆకుల శివ కూడా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి3 సినిమా చేస్తున్నాడు.