విజయవాడ కనక దుర్గ అమ్మవారిని నటుడు నందమూరి బాల కృష్ణ ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు మీడియా పాయింట్ వద్దకు వచ్చారు.
కానీ మీడియా పాయింట్‌లో మైక్ ఏర్పాటు చేయకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మైక్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల అరుపులు ,కేకల మద్య ఆయన మీడియాతో మాట్లాడారు.
వీఐపీ ప్రోటోకాల్ ఉన్నప్పటికీ సమాచార శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆయన అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. అటు ఆయన అభిమానులు కూడా అధికారుల తీరుపై విమర్శలు చేశారు.
మరోవైపు దసరా పండుగ వేళ ఆలయ అధికారుల నిర్లక్ష్యం వహించారు. చిన రాజ గోపురం వద్ద వాడిపోయిన పూలు కనిపించాయి. కనీసం తాజా పూలతో అలంకరణ కూడా చేయలేదు.
దీంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా ఘటన ఎప్పుడూ చూడలేదని భక్తులు అన్నారు.