టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ స్పందించారు. పార్టీ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై అనవసర విమర్శలు చేస్తున్నారని.. వ్యక్తిగత దూషణలకు పాల్పడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, వంశీ ఈ స్థానంలో ఉండడానికి తన మామయ్య చంద్రబాబే కారణమన్నారు. విధి విధానాల పరంగా ఏమైనా అభ్యంతరాలుంటే విమర్శించుకోవచ్చని…కానీ ఇకపై నోటికొచ్చినట్టు తిడితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.