నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా ఏళ్ళ అవుతున్నా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తన కెరీర్ లో అతనొక్కడు, పటాస్, తరువాత చెప్పుకోదగ్గ హిట్ ను కొట్టలేకపోయాడు.
అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా వాటిలో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో రనుందట. ఈ సినిమాకు డూ ఆర్ డై అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు రెడి అవుతున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా, కొత్త దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.