నందమూరి తారకరత్న భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్న మరణాన్ని ఆయన అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
తారకరత్న భౌతిక కాయాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కూతురు నిష్క గుండెలు అవిసిపోయేలా ఏడుస్తోంది. తన తండ్రి ఇక తిరిగి రాడని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
నిష్క బాధను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి పార్థివ దేహాన్ని చూసి ఆమె ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని ఆయన స్వగృహంలో ఉంచారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.