స్పృహతప్పి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు వైద్యులు. ఆయనకు స్టెంట్ వేశామని, ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు సినీ నటుడు తారకరత్న.
తీవ్ర అస్వస్థతకు గురై.. స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ని కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే సరికి తారకరత్న పల్స్ పడిపోయాయి.
ఆ సమయంలో ఆయన శరీరం మొత్తం బ్లూగా మారిందని.. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టామన్నారు. 45 నిమిషాల తర్వాత పల్స్ మళ్లీ మొదలైందన్నారు వైద్యులు. ఇక ఆ తర్వాత సీపీఆర్ చేసిన వైద్యులు.. యాంజియో గ్రామ్ చేశామన్నారు.
తర్వాత తారక్ గుండెలో స్టెంట్ వేసినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పరిస్థితిని బట్టి ఆయన్ని బెంగుళూరుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు.