హోలీ సందర్భంగా ఓ మహాకవుల సమ్మేళనం జరుగుతోంది. అప్పటికే విచ్చేసిన కవులంతా హడావుడిగా ఉన్నారు. అప్పుడే విచ్చేసారు ఓ కవి ముఖ్య అతిథిగా ఎంట్రీ ఇచ్చారు. వారు మాములుగా వచ్చారా..! చెబుతా వినండి.
నుదుట వీరతిలకం..మెడలో పూల దండ. శరీరంపై కప్పుకున్న శాలువాతో చాలా హుందాగా విచ్చేసారు. కాకపోతే వారిని చూసిన వాళ్ళంతా ఒకటే నవ్వు. కట్ చేస్తే ఆ కవికి తోకుంది. తోక ఉండడం ఏంటిరా అంటే…ఆ కవిగారు ఓ గాడిద.
కవి సమ్మేళనానికి గాడిద ముఖ్య అతిథిగా రావడం ఏంటనుకుంటున్నారా.? విషయం ఏంటంటే…దేశ వ్యాప్తంగా హోలీ సందడి కనిపిస్తోంది. హోలీలో ఎలాగూ ఉత్సాహాం ఆనందం కలగలిసి ఉంటాయి.
దీనికి కాస్త కవిత్వం జోడిస్తే బావుటుంది అనుకున్నారు కొందరు హాస్యప్రియులు. కాక పోతే అది నార్మల్ కవిత్వం కాదు. బూతు కవిత్వం. ఎవర్నీ కించపరచడానికి కాదు.ఓన్లీ కామెడీ పర్పస్ అంటున్నారు నిర్వాహకులు.
నాందేడ్‌లో జరిగే ఈ హోలీ కవిత్వ సేకరణ చాలా భిన్నమైన సంప్రదాయాన్ని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా ఇక్కడ మహామూర్ఖ్ కవిసమ్మేళన్ జరుగుతుంది. మహారాష్ట్రలో ఈ సదస్సు ఒక్కటే. ద్వంద్వ,దూషణ పద్యాలను ప్రదర్శించారు.
అందుకే ఇక్కడికి మహిళలు, పిల్లలను అనుమతించరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ ప్రదేశంలో గాడిదను ముఖ్య అతిథిగా ఆహ్వానించే సంప్రదాయం ఉంది. నాందేడ్‌లో ఈ సమావేశం జరిగింది.
ఇది పురుషులు మాత్రమే పాల్గొనే కవిత్వోత్సవం. మూర్ఖులకు అధిపతి అయిన గార్దభానికి స్వాగతం పలుకుతూ కవుల సమ్మేళనం ప్రారంభమైంది. ఈ కవి సమ్మేళనానికి రాష్ట్రంలోని ప్రముఖ కవులు హాజరయ్యారు.
రాష్ట్రంలోని ప్రముఖ కవులు పాల్గొన్న ఈ కవిసమ్మేళనంలో ద్విపద కవిత్వం, అసభ్యకర హాస్యంతో కవిసమ్మేళనం చక్కగా సాగింది. ఒకటి కంటే ఎక్కువ శృంగార పాటలు, డబుల్ మీనింగ్ పద్యాలు, జోకులు, మనోహరమైన నృత్యాలు ప్రదర్శించారు.
హోలీ సంప్రదాయ ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సామాజిక కార్యకర్త దిలీప్ ఠాకూర్ ఇరవై ఏళ్లుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బనారస్ తర్వాత దేశంలోనే నాందేడ్‌లో మాత్రమే ఇలాంటి కవి సమ్మేళనం జరిగింది.