దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న సినిమా విరాటపర్వం. 1990 నాటి సామజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ లో బహుభాషా నటి నందిత దాస్ కూడా జాయిన్ అయ్యారు. నందిత దాస్ షూటింగ్ లో పాల్గొన్న పోటోలను దర్శకుడు వేణు అడుగుల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
కాగా ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అయినప్పటికీ ఈ సినిమాలో మాత్రం కొత్త కోణాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయట. ముఖ్యంగా రానా పాత్రలో పాజిటివ్ థింకింగ్ తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని అది సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని, మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Advertisements