తెరపై సహజనటుడిగా పేరు తెచ్చుకున్నాడు నాని. అయితే.. తన కంటే తన భార్య ఇంకా పెద్ద నటి అంటున్నాడు. తనముందు ఆమె నటన ఆస్కార్ రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ నాని భార్య.. భర్త ముందు ఎందుకలా నటిస్తుంది. దీనికి కారణం కూడా చెప్పాడు.
నానిది పూర్తిగా సినిమా ప్రపంచం. కానీ.. ఆమె భార్య తరఫు వాళ్లది మాత్రం పూర్తిగా రివర్స్. వాళ్లది బాగా చదువుకున్న కుటుంబం. అందరూ సైంటిస్టులే. ఇలాంటి కుటుంబం నుంచి రావడం వల్ల నాని భార్యకు సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదట. భర్త మూవీస్ మాత్రం చూసి బాగుందని చెబుతుందట.
నానికి మాత్రం ప్రతి సినిమా మేటర్ తన వైఫ్ తో షేర్ చేసుకోవాలని కోరిక. ఓ మంచి మూవీ చూసినా, ఓ మంచి కథ విన్నా, ఏదైనా రోజు బాగా నటించినా ఆ వివరాలు భార్యతో షేర్ చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్ లో భర్త ఉత్సాహాన్ని నీరుగార్చడం ఇష్టంలేక, అతడు చెప్పినవన్నీ వింటున్నట్టు నటిస్తుందట. ఈ విషయాల్ని నాని చెప్పుకొచ్చాడు.
అలా తన ముందు తన భార్య ఆస్కార్ లెవెల్లో నటిస్తుందని అన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత అసలు సినిమా ప్రపంచం ఉండదని అంటున్నాడు నాని. తన మైండ్ లో ఆ విశేషాలు, అప్ డేట్స్ ఎప్పుడూ ఉంటాయని, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అవి బయటకు రావని అన్నాడు.