న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ మూవీలో నటించేందుకు రెడీ అయ్యారు. శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ తో రానున్నారు. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో గురువారం నుండి సినిమా లాంఛనంగా మొదలుకానుంది. హైదరాబాద్ లో కొబ్బరికాయ కొట్టనున్నారు.
దీంతో చిత్ర నిర్మాతలు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కలకత్తా కాళీ మాత బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ మూవీ టైటిల్ ను బట్టి కలకత్తా నేపథ్యంలో కథ సాగనుందని అర్థం అవుతుంది. బోయినపల్లి వెంకట్ సినిమా నిర్మిస్తుండగా… సాయి పల్లవి, క్రితీ శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం సమకూర్చనున్నారు.