న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా కూడా చేయబోతున్నాడు. తెలంగాణా నేపధ్యంలో ఒక గ్రామీణ ప్రేమకథ గా దసరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
గత ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని ప్రకటించగా, బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కాబోతుంది. అలాగే ఏడాది చివరిలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమా కోసం 12 కోట్ల రూపాయలతో భారీ విలేజ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.