రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్యామ్ సింగ రాయ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే సాయి పల్లవి కూడా మరో హీరోయిన్ పాత్రలో నటించింది.
డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక ఈ చిత్రం విజయం సాధించడం పట్ల సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి నాని ని అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ ల ను కలవడం సంతోషంగా ఉందన్నారు.
ఇక మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ను నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ నిర్మించారు.
Priceless Moments ❤️
Thanks alot dear MEGA 🌟 @KChiruTweets garu – Surekha garu for your kind words & lovely gesture 🙏
A Heart Warming moment for the entire team of #ShyamSinghaRoy ❤️🔥@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @Rahul_Sankrityn@vboyanapalli @NiharikaEnt pic.twitter.com/JyEunsXJF0
— Niharika Entertainment (@NiharikaEnt) January 21, 2022