న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ చిత్రాల తర్వాత నాని నటిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. నాని కెరీర్ లోనే అత్యధికంగా ప్రీరిలీజ్ జరుపుకోవడమే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.
నాని ఇప్పటి వరకు ఎప్పుడూ నటించని పాత్రలో కనిపంచనున్నారు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్ లో బజ్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా అత్యంత సహజంగా ఉన్న లొకేషన్స్ ప్రేక్షకులకు గతంలోకి తీసుకెళ్లినట్టు ఉంది. సింగిరేణి నేపథ్యంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు అర్థమవుతోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల.. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం సినిమా టీజర్ ను విడుదల చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను విడుదల చేశారు.
టీజర్ విషయానికొస్తే నాని వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ కనిపించని విధంగా ధరణి పాత్రలో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా టీజర్ చివరిలో నోటిలో కత్తి పెట్టుకొని కనిపించే సీన్ గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది.