తెలుగులోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సినిమా ఎలా ఉన్నా ఆయన ఎంచుకునే కథాంశాలు మాత్రం చాలా బాగుంటాయి. అవసరమైతే అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా పోషిస్తూ అలరిస్తుంటాడు.
తాజాగా నాని మరోసారి విలన్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.జెండాపై కపిరాజు, జెంటిల్‌మెన్, వి వంటి మూవీల్లో నెగెటివ్ రోల్‌లో నటించిన నాని, శ్రీకాంత్ ఒదెల డైరెక్ట్ చేస్తున్న దసరా మూవీలో నాని యాంటీ హీరో పాత్రను పోషించనున్నాడని సమాచారం.
కరోనా కారణంగా ప్రస్తుతం దసరా మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్తో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.