హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నాని నటించిన టక్ జగదీష్ సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం అంటే సుందరానికి, శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఇదిలా ఉండగా… నాని తరువాత సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. అది ఏంటంటే…. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట.
శ్రీకాంత్ కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ… కథ నచ్చడంతో ఓకే చెప్పారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణ యాసలో నాని ఈ సినిమాలో మాట్లాడబోతున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.