న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా… తను ఇప్పటికే నటించిన శ్యామ్ సింగా రాయ్ విడుదలకు రెడీగా ఉంది. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాని ఫిక్స్ అయ్యాడు.
నాని త్వరలో కొత్త సినిమా చేయబోతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు దసరా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం నాని తెలంగాణ యాస కూడా నేర్చుకోబోతున్నాడు. తెలంగాణ పల్లెల్లో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రాబోతుంది.