నాని ఇటీవల టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం అంటే సుందరానికి ,శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా… తాజా సమచారం ప్రకారం నాని తన నెక్స్ట్ సినిమాతో పెద్ద షాక్ ఇవ్వోతున్నాడట. ఈ విషయాన్ని నాని స్వయంగా చెప్పారు. టక్ జగదీష్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ… దసరా సందర్భంగా తన నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించనున్నాడట. ఇక ఆ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరూ షాక్ అవుతారట. మరి చూడాలి ఆ లుక్ ఎలా ఉంటుందో.