మార్చి నెలలో రాధే శ్యామ్, RRR రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. విడుదల తేదీలు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుతూ కొత్త జీవో జారీ చేసింది.
ఇక ఇదే విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉండాలంటే ప్రతి సినిమా కనీసం 20% షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లో చేయాలన్నారు.
RRR, రాధే శ్యామ్ అలా చేయనప్పటికీ ప్రభుత్వం ఈ చిత్రాలకు మినహాయింపు ఇచ్చిందన్నారు. అయితే, టిక్కెట్ ధర పెంపును పరిగణనలోకి తీసుకుని రాబోయే సినిమాలలో తప్పనిసరిగా 20% షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లో షూట్ చేయాలన్నారు.
ఇక RRR , రాధే శ్యామ్‌ల కోసం ఐదవ అదనపు షో కు కూడా ప్రభుత్వం ఆమెదించిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్ మార్చి 11న విడుదల అవుతుండగా RRR సినిమా 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.