న్యాచురల్ స్టార్ నాని నటించబోయే నెక్ట్స్ సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో అట్టహసంగా స్టార్ట్ అయ్యింది. ఇక నుండి శరవేగంగా, లాంగ్ షెడ్యూల్ తో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే నుండే నాని షూటింగ్ కు హజరుకాగా… నానితో ముగ్గురు ముద్దుగుమ్మలు సాయి పల్లవి, క్రితీ శెట్టి, మడొన్నా సెబాస్టియన్ లు ఆడిపాడనున్నారు.
ఈ సినిమాకు రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తుండగా, జంగ సత్యదేవ్ కథను అందించారు. మిక్కిజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్… ఇక నుండి రెగ్యూలర్ గా అప్డేట్స్ అందివ్వనుంది.