రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినీ ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై మండిపడ్డాడు. ఇక పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తున్నారు సినీ స్టార్స్. తాజాగా న్యాచురల్ నాని స్పందించారు.
పవన్ కళ్యాణ్ సర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి. ఆయన చెప్పిందే వాస్తవం… చిత్ర పరిశ్రమ సమస్యలను జెన్యూన్ గా వెల్లడించారు. ఆ సమస్యలపై వెంటనే శ్రద్ధ పెట్టడం అవసరం. ఇంకా ఆలస్యం కాకముందే ముఖ్యమంత్రి జగన్ గారు, సంబంధిత మంత్రులు ఈ విషయంపై దృష్టి సారించాలని ఒక ఇండస్ట్రీ మెంబెర్ గా నేను వినయంగా అభ్యర్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు నాని.
As a member of film fraternity I humbly request @ysjagan gaaru and concerned Ministers to look in to it before it gets too late for the cinema to revive 🙏🏼 https://t.co/5ShufVbWFL
— Nani (@NameisNani) September 26, 2021
Advertisements