న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా వి. ఈ సినిమాలో సుధీర్‌భాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్ కూడా నటిస్తున్నారు. ఉగాది కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. మరో వైపు థియేటర్స్ కూడా ఇప్పట్లో ప్రారంభం అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఓటిటి లో రిలీజ్ చెయ్యటానికి సిద్ధం అవుతున్నాడట. లాక్ డౌన్ ప్రారంభంలోనే ఓ టిటి నుంచి మంచి ఆఫర్ వచ్చినప్పటికీ నో చెప్పిన దిల్‌రాజు ఎట్టకేలకు ఓకే చెప్పారని, ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థతో ఈ డీల్ కుదిరిందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్‌లో ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలవ్వబోతుంది.