న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. కరోనా కారణంగా థియేటర్ లు లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైంది. కాగా ఓటిటి లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో ఎక్కువ మంది చూసిన సినిమాగా ఇది నిలిచినప్పటికీ హిట్ టాక్ మాత్రం తెచ్చుకోలేక పోయింది.
కాగా ఇప్పుడు బుల్లితెరపై కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేకపోయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేస్తే కేవలం 6.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. అల వైకుంఠ పురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మంచి రేటింగ్ తెచ్చుకోగా ఈ సినిమా ఆ రేంజ్ లో రేటింగ్ ను తెచ్చుకోలేక పోయింది. ఇక నాని గత చిత్రం గ్యాంగ్ లీడర్ కు 8.6 టిఆర్పీ రాగా జెర్సీ మూవీకి 8.8 టిఆర్పీ వచ్చింది. వీటితో పోలిస్తే వి సినిమా బుల్లితెరపై కూడా ఫ్లాప్ అయిందని చెప్పాలి.