న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘V’. నాని విలన్‌గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. మరోవైపు సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అష్ట చమ్మతో నాని, ఇంద్రగంటి మొదటి సారి జతకట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మధ్యలో జెంటిల్ మాన్ సినిమాతో జతకట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి జాతకట్టారు.
ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ సినిమాపై హైప్ ను అమాంతం పెంచాయి. తాజాగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఎప్పడూ చూడని యాంగిల్ లో నానిని దర్శకుడు ఇంద్రగంటి చూపించారు. మరో వైపు సుధీర్ బాబుని ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ గా చూపించారు. నానిని పట్టుకునే పాత్రలో సుధీర్ బాబు నటిస్తునట్లు టీజర్ లో తెలుస్తుంది. ఇక పోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేథా థామస్, అతిది రావు నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానుంది.