తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా పేరున్న దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి కలిసి నాని ‘ వి ‘ చిత్రాన్ని నిర్మించారు. మొదట థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.అయితే ఈ చిత్రం పై మిక్స్ ఒపీనియన్ వచ్చింది.ఇది ముందుగానే ఊహించిన దిల్ రాజు స్వల్ప లాభం కోసం చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది.ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు దిల్ రాజు ఈ చిత్రం పై ఎంత ఖర్చు చేశారు ఎంత లాభాలను పొందారో ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు చూద్దాం.
తొలుత ఈ చిత్రానికి ఖర్చు చేసిన మొత్తం 33 కోట్లు.
ఇక వడ్డీలు అయితే : 3 కోట్లు అయ్యాయి.
అంటే మొత్తం విలువ 36 కోట్లు.
ఇక ఈ చిత్రం చేసిన బిజినెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం ….
అమెజాన్ ప్రైమ్ – 31 కోట్లు
శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడం కోసం జెమినీ – 8 కోట్లు ఖర్చు చేసింది.
హిందీ డబ్బింగ్ రైట్స్ – 7 కోట్లు
బిజినెస్ చేసిన మొత్తం 46 కోట్లు.
ఇలా మిక్స్ టాక్ మూట కట్టుకున్న ‘ వి ‘ చిత్రంతో దిల్ రాజు పదికోట్ల ఆదాయాన్ని సంపాదించారు.