మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో పోటీకి దిగుతున్న వారు ఒకరి ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో న్యాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మా ఎన్నికలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ… తెలుగు పరిశ్రమలో ఏదైనా మార్చాలనుకుంటున్నారా అని నానిని ప్రశ్నించగా… మా ఎన్నికలకు సంబంధించి నటులు ప్రెస్ మీట్లు, టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం తనకు నచ్చలేదని, వారు దానిని ఆపాలని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు చేసి చాలా రోజులు అవుతున్నా..నాని చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నాని ఎన్నికలలో పాల్గొనడం లేదని, ఆ పేద మా సభ్యుల సంక్షేమం గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని అలాంటప్పుడు ఎన్నికల విధానాలు, ప్రచారం గురించి అతను ఎలా కామెంట్ చేస్తాడు అని సీనియర్స్ మండిపడుతున్నారు.