‘అమ్మాయిలు ఇంతందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్..’ అంటున్నాడు నాచురల్ స్టార్ నాని. అదేంటి అంతమాట అనేశాడు అనుకోవద్దు. ఇది జస్ట్ ఓ సాంగ్‌కు ముందు వచ్చే ఇంట్రడక్షన్ సీన్.
నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ మూడో పాట వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆ తరువాత వచ్చిన రెండు సాంగ్స్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. వీటికి చాలా మంచి స్పందన వచ్చింది. పండగ రోజు కమింగ్ అట్రాక్షన్స్ మూవీల్లానే ఈ మూవీ నుంచి కూడా మూడో పాటను విడుదల చేశారు. ‘నిన్ను చూసే ఆనందంలో..’ అంటూ మొదలయ్యే మాంచి మెలోడీ సాంగ్ని ఇది. అనిరుధ్ మ్యూజిక్ కాబట్టి.. మెలోడియస్‌గానే వుంటుంది. సిద్ శ్రీరామ్‌తో పాటు అనిరుధ్ కూడా స్వరం కలిపారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.
సాంగ్‌కు ముందు వచ్చే సీన్ కూడా ఈ సాంగ్ టీజర్‌కు జత చేశారు. ప్రియాంక అరుల్ తన చీర కట్టును చూసుకుంటూ నానీ వైపు తిరిగి ‘ఎలావుంది? ’ అంటుంది. ఓకేనా అని అడుగుతుంది. దానికి నానీ తన స్టయిల్లో చాలా రొమాంటిక్‌గా ఆమెని చూస్తాడు. ‘అమ్మాయిలు ఇంతందంగా వుండకూడదు తెలుసా ? అంటూ ఆన్సరిచ్చాడు. అప్పుడు అతన్ని ఇలారా.. ఇలారా.. అంటు అడుగుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే సాంగ్ ఇది.
ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా తదితరులు నటిస్తున్నారు. ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ కార్తికేయ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. ఈనెల 13న ధియెటర్లలో ఈ గ్యాంగ్ లీడర్‌ని చూడచ్చు.
This song is very special to us.. Presenting to you #NinnuChuseAnandamlo – https://t.co/G3pMAOAD9P
Thank you @sidsriram and #anantasriram@NameisNani @Vikram_K_Kumar @priyankaamohan @MythriOfficial @sonymusicsouth
— Anirudh Ravichander (@anirudhofficial) September 2, 2019