హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్‌లీడర్’ ట్రైలర్ రిలీజయ్యింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ట్విటర్ వేదికగా నానీ ఈ ట్రైలర్ వదులుతూ.. ‘ఫస్టు టైమ్ ఒక పెన్సిల్ రాసిన ఒక ఒరిజినల్ కథ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సాయంతో తమ పగ తీర్చుకుంటూ ఉంటారు. హలీవుడ్ చిత్రాలను చూసి నాని పుస్తకాలు రాస్తూ ఉంటాడు. అలా ఆయన ‘కిల్ బిల్’ సినిమా చూసి ‘రశీదును చంపు’ అనే పుస్తకం రాశాడనే విషయం ట్రైలర్ ప్రారంభంలో తెలుస్తోంది. ‘యుద్ధానికి సిద్ధంకండి.. సమరశంఖం నేను ఊదుతాను’ అంటూ నాని చెప్పే డైలాగ్‌లతోపాటు.. ‘ఐదుగురు ఆడవాళ్లు, వాళ్లతో ఒకడు’ అంటూ ప్రతినాయకుడి పాత్రలో కార్తికేయ చెప్పిన డైలాగ్‌లు ఇందులో వున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
First time pencil రాసిన ఒక original story ✏️?
THIS SEPTEMBER 13th
REVENGERS ASSEMBLE
EXPECT THE UNEXPECTED #GangLeaderTrailer ?????https://t.co/VTpKOgzbHU@Vikram_K_Kumar @anirudhofficial @ActorKartikeya @priyankaamohan @MythriOfficial— Nani (@NameisNani) August 28, 2019