న్యాచురల్ స్టార్ నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించి మంచి వసూళ్లు రాబట్టింది. అయితే తాజగా ఈ చిత్రం అరుదైన గౌరవం సాధించింది . జెర్సీ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. తమ చిత్రానికి ఇంత గౌరవం దక్కడంపై చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. జెర్సీ చిత్రమే కాకుండా, సూపర్ 30,కార్తీ నటించిన ఖైదీ కూడా ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.