సినిమా, పాలిటిక్స్ పరస్పర ఆధారితాలు. వాళ్ల అవసరాలు వీళ్లకి, వీళ్ల అవసరాలు వాళ్లకి కచ్చితంగా వుంటాయి. అది తెలిసిన వాడినే జ్ఞానీ అని అంటారు. టీడీపీ సెకండ్ జనరేషన్ లీడర్ లోకేశ్ దీన్ని బాగా వంటి పట్టించుకున్నాడు. తండ్రికి పిల్లనిచ్చిన మామగారు, తనకు పిల్లనిచ్చిన మామగారు సినిమాల నుంచే వచ్చారు కదా. అందుకే సినిమావాళ్లతో కూడా లోకేశ్ మంచి రిలేషన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. తాజాగా వచ్చిన సైరా మూవీ చూసి మెగాస్టార్‌ను తెగ మెచ్చేసుకున్నాడు. ఆ ఉద్వేగాన్ని అక్షరాల్లోకి మార్చి ట్విటర్‌లోకి చేర్చాడు.
నారాలోకేశ్‌కు మెగాస్టార్ సైరా బాగా నచ్చేసిందట. ‘సైరా’ సినిమా చూసి తన ఫీలింగ్స్ అన్నీ ట్వీటర్ ద్వారా షేర్ చేశాడు. ‘తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా సైరా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా చిరంజీవిగారి 12 ఏళ్ళ కల అని నారా లోకేష్ పేర్కొంటూ, తన కలను ఎంతో అద్భుతంగా చిరంజీవి ఆవిష్కరించుకున్నారని లోకేష్ వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచిందని నారా లోకేష్ చెప్పారు. ‘హ్యాట్సాఫ్! చిరంజీవిగారు’ అంటూ నారా లోకేష్ ప్రశంసించాడు. మూవీని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్‌చరణ్, దర్శకులు సురేంద్ర, ఇతర చిత్ర యూనిట్‌కు లోకేష్ గ్రీటింగ్స్ చెప్పాడు.
తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు.
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 4, 2019