నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
అమరావతిని అంతం చేసేందుకు వైసీపీ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటినీ రైతులు ఓర్పుతో ఛేదించారు. బెదిరింపులు, అణిచివేత, అరెస్టులకు అదరం, బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువతకు ఉద్యమాభివందనాలు.
రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేశామని ఆనందపడుతున్న జగన్ రెడ్డి గారూ… మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులదే అంతిమ విజయం.