టిఎన్ఎస్ఎఫ్ మేధోమదన సదస్సు లో వైసీపీ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు నారా లోకేష్. మీ నాన్న ఎవరు అని తెలుగు లో అడుగుతాం. హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్ లో అడుగుతాం. వైకాపా భాష లో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారంటూ ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చు అని అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే దేశానికే ప్రమాదం, అలాంటి కోరికలు నాకు లేవంటూ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారని విమర్శించారు. బాబు హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారని, పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెప్పిందన్నారు .
ఉత్తరాంధ్రకి వస్తాం అన్న కంపెనీలు అదానీ, లులూ గ్రూపులను తరిమేశారని ఆరోపించారు. జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ విశాఖని దెబ్బతీసింది. ఇక కంపెనీలు అక్కడికి రావడానికి బయపడతాయి. రాయలసీమకి వస్తాం అన్న రిలయన్స్ జియో కంపెనీని తరిమేశారు. నిరుద్యోగ భృతి ఎత్తేశారు. యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఆరోపించారు లోకేష్. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఉన్న ఉద్యోగాలు,ఉన్న కంపెనీలు పోయాయి. కీయా యాజమాన్యాన్ని వైకాపా ఎంపీ బెదిరించారు.అందుకే వాళ్లు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపారని ఆరోపించారు.