నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
దిశ చట్టం పేరుతో మహిళలని మోసం చేసిన మోసగాడు జగన్ రెడ్డి. సొంత చెల్లిని ఒంటరిని చేసి పక్క రాష్ట్రానికి తరిమేసినోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తాడా? జగన్ రెడ్డి పాలనలో అన్ని ప్రశ్నలే…సమాధానాలు ఉండవు. అసలు దిశ చట్టం ఉందా? లేని దిశ చట్టంతో ఇద్దరికి ఇద్దరికి ఉరి శిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు, మొత్తంగా 20 మందికి కఠిన శిక్షలు పడ్డాయని పోలీసులు, హోం మంత్రి చెబుతున్నారు. జగన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలకు రక్షణ ఉందా? ఆయన తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఆడ బిడ్డలకు భద్రత ఉందా? సీఎం గారి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆడపడుచులకు రక్షణ ఉందా?
జగన్ రెడ్డి చెల్లెమ్మ వైఎస్ సునీతా రెడ్డి తనకి రక్షణ లేదంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన యువతి పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను అరెస్ట్ చెయ్యలేదు. ఆ కేసులో ఒక్కడే ఎందుకు దొరికాడు? ఇంకొకడు ఎందుకు దొరకలేదు? ఒక సామాజికవర్గానికి చెందిన వాడిని రక్షించడానికి ఒక ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని దారుణంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. విచిత్రం ఏంటంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 517 ఘటనలు జరిగాయి. ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదు. బాధిత కుటుంబాలకు జరిగిన న్యాయం తక్కువ. దిశ చట్టం, దిశ యాప్ తో జగన్ రెడ్డి కొట్టేసింది ఎక్కువ. దిశ చట్టం, దిశ యాప్ పేరు చెప్పి సొంత పత్రిక, ఛానల్ కి 30 కోట్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు. పాదయాత్ర లో గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. అది బుల్లెట్ లేని గన్ అని తేలిపోయింది. ఇకనైనా మాయ మాటలతో కాలక్షేపం మానండి జగన్ రెడ్డి .