విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అమ్మడానికి వాడెవ్వడు? కొనడానికి వీడెవ్వడు? అంటూ మండిపడ్డారు. పోస్కో,గోస్కో అని వస్తే చర్మం ఒలుస్తామని హెచ్చరించారు. 30 వేల మంది ప్రత్యక్షంగా,లక్ష మంది పరోక్షంగా ఆధారపడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అంటే కేంద్రానికి లాభనష్టాలు వ్యవహారమేకానీ.. ఆంధ్రులకు విశాఖ ఉక్కు అంటే ప్రాణమని చెప్పారు.
విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే 151 మంది ఎమ్మెల్యేలు,28 ఎంపీలు గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్ కు లేదని విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని జగన్ హోదా ఏం సాధిస్తారని ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసమే లాలూచీ పడ్డారని ఆరోపించారు.
విజయలక్ష్మి గారిని ఓడించారనే కక్షతోనే విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు జగన్ రెడ్డి అంగీకరించారు .ఎంపీలను మాట్లాడొద్దని జగన్ హెచ్చరించారు అంటేనే దీని వెనుక ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని అన్నారు లోకేష్.