ఒక్క ఛాన్స్ అనుకుంటూ అధికారంలోకి వచ్చి అభివృద్ధి నో ఛాన్స్ అనేలా వైసీపీ ప్రవర్తిస్తుందన్నారు నారా లోకేష్. మంగళగిరిలో లో పర్యటించిన నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు పోతే ఆశ్చర్యపోయేవారని కానీ ఇప్పుడు కరెంటు ఉంటె ఆశ్చర్యపోతున్నారంటూ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడానికి చూస్తున్నారు, కానీ అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టట్లేదంటూ ఆరోపించారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర అంటూ అవగాహనా కార్యక్రమాలు చేపడితే, ఇప్పుడున్న వైసీపీ 2500 మంది చనిపోతే గాలికి వదిలేసిందంటూ ఆరోపించారు లోకేష్. ఎన్నికలముందు కోతల రాయుడిలా హామీలిచ్చిన జగన్ ఇప్పుడు ఒక్కో హామీని కోసేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.