నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
రమ్య ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన.. రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది.
ప్రతిపక్ష పార్టీల నాయకులని తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టివుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయి ఉండేవి కావు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి ఉరి శిక్ష అన్నారు కదా.. జగన్ గారూ.. మీ రెండేళ్ల పాలనలో 500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈరోజు వరకూ ఒక్కరికీ శిక్ష పడింది లేదు. ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడిరోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించండి. ఇక 17 రోజులు మాత్రమే మిగిలాయి.