కేసుల భయంతో ఒకరు, ఆస్తులు కాపాడుకోవటానికి మరొకరు పార్టీ మారారని నారా లోకేష్ ఆరోపించారు . వంశీకి ఏమాత్రం సిగ్గున్నా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజుల క్రితం పార్టీ కార్యకర్తలపై వేధింపులు అన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ మారి అధినేతపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు లోకేష్.
ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంకు తాము వ్యతిరేకం కాదని, తెలుగు మీడియంను ఆప్షన్‌గా అయినా కొనసాగించాలని కోరుతున్నామన్నారు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదివింది నిజమేనని, సీఎం జగన్ పేపర్ లీకేజీలో దొరికారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయటమా అని మండిపడ్డారు.