గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుని వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఒకరు బిన్ లాడెన్‌లా ఫోటో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వైనంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని మీద ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టిన లోకేష్.. జగన్‌మోహన్‌రెడ్డిని సంభోదిస్తూ.. అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వున్నట్టా లేనట్టా..? మీ గుడ్డి సర్కారు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనబడ్డం లేదా ? ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు చేతులు రావట్లేదా..? అంటూ నిలదీశారు. మీ చట్టాలన్నీ తెదేపా వాళ్ల మీద కేసులు పెట్టడానికేనా.. అంటూ దుయ్యబట్టారు.
Advertisements