గుంటూరు : నారా లోకేష్ ఇసుక తట్ట నెత్తిన పెట్టుకున్నాడు. భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి ఫోటోలు తీయించుకున్నాడు. ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల తమకు పనులు లేక పొట్ట కొట్టినట్టయ్యిందని భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. మంగళగిరి పట్టణంలో లోకేష్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ర్యాలీలో పెద్దపెట్టున నినాదాలు వినిపించాయి.