తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహం మాయంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఇది పక్కాగా వైసీపీ వర్గాల పనేనని ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి లోకేష్ ఈ ఇష్యూపై స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ఆ విగ్రహం ఏం చేసిందని ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు లోకేష్.
లోకేష్ చేసిన ట్వీట్
రామతీర్థంలో హిందువుల ఆరాధ్యదైవం రాముడి విగ్రహం తల ఎత్తుకుపోయిన అరాచక పాలనలో, రాజమహేంద్రవరంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎత్తుకెళ్లింది ఎవరో ప్రజలకి తెలుసు. 31వ వార్డులో ఇటీవల ప్రతిష్టించిన ఎన్టీఆర్ విగ్రహం మిమ్మల్నేం చేసిందని ఎత్తుకుపోయారు..? విగ్రహ దొంగలని పట్టుకుని శిక్షించాలి. అదేస్థానంలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించాలి.