నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
బీసీల ఊసే లేకుండా ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో ఈ బడ్జెట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం కోతలు పెడుతోంది.
మాజీ సీఎంలు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ.1,850 పెన్షన్ ఇస్తే.. తండ్రి, కొడుకులు కలిసి ఇచ్చింది రూ.625 మాత్రమే. అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారు.
అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం. మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు. ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు… జగన్ మోసపు రెడ్డి అని ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలి.