నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నిటినీ చెరబడతాడనడానికి జగన్ ప్రత్యక్ష ఉదాహరణ. అర్ధరాత్రి అక్రమంగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ రద్దు చెయ్యమని నిలదీయడం అశోక్ బాబు చేసిన తప్పా? పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరఫున పోరాడటం నేరమా?
సీఐడీని రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చుకున్నారు. వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ ని గుడ్డిగా కొందరు అధికారులు అమలు చేస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. వారంతా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకుంటుంది. అశోక్ బాబును సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు.