లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీ
నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపమేమైనా జగన్ కు ఉందా? అబద్ధాలే శ్వాసగా ఆయన బతికేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా సారా విషయంలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయి.
సీఎం ఊళ్లో నాటు సారా బట్టీని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డి గూడెం లాంటి పట్టణంలో నాటు సారా కాస్తారా అని అమాయకంగా ఆయన అడిగారు కదా.. ఇప్పుడు సొంత ఊరు పులివెందులలోనే బట్టీలు బయటపడ్డాయి.
జగన్.. దీనికి ఏం సమాధానం చెపుతారు? ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 2021 జనవరి నుండి ఇప్పటి వరకూ 300 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడేం అబద్ధాలు చెబుతారు.
స్వయంగా ముఖ్యమంత్రి నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతుంటే రాష్ట్రంలో సారా మరణాలకి అంతు ఉంటుందా?