విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలే ఉన్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డితో సీఎం జగన్ దొంగ ఆరోపణలు చేయిస్తున్నారన్నాని ఆరోపించారు. ఈ మేరకు వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు లోకేశ్.
ఏ1 క్రిమినల్ సీఎం..తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు. నీ బతుకు ఫేక్. నీ పార్టీ ఫేక్. నీ హామీలు ఫేక్. నీ పాలన ఫేక్. చివరికి నాపై నీ దొంగల బ్యాచీతో చేయించే ఆరోపణలూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. (1/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021
వైసీపీ పార్టీ, జగన్ హామీలు, పాలన అన్ని ఫేక్ అంటూ తన ట్వీట్‌లో విరుచుకుపడ్డారు లోకేష్. ఇంకా ఎన్నాళ్లు దొంగలతో దొంగ ఆరోపణలు చేయిస్తారంటూ నిలదీశారు. విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమా లోకేశ్ ఛాలెంజ్ చేశారు. ప్రమాణానికి సింహాచలం అప్పన్న సన్నిధికి వస్తే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే తనపై దొంగల బ్యాచ్‌తో చేయించే ఆరోపణలు ఫేక్ అనే విషయం పింక్ డైమండ్‌తోనే తేలిందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.