మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మళ్లీ రాజకీయాలను వేడెక్కించింది. హత్య జరిగి రెండు సంవత్‌జరాలు పూర్తైనా… చంపిందెవరో తేల్చటం లేదని వివేకా కూతురు డా.సునీత ఫైర్ అయ్యారు. హత్య కేసు దర్యాప్తులో ఎవరూ సహకరించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ… అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు. మీ చిన్నాన్నను మా నాన్నచంద్రబాబు నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు… చెప్పు అబ్బాయి! అంటూ సీఎం జగన్ ను లోకేష్ నిలదీశారు. ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్, ఈ హత్య కేసు విచారణకు సీబీఐ వస్తుందంటేనే గజగజా వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.
అంతా అడిగినట్టే… నేనూ అడుగుతున్నాను జగన్‌రెడ్డీ!#whokilledbabai ? … చెప్పు అబ్బాయి! మీ చిన నాయనని మా నాయన నరికేశాడన్నావు. సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు..(1/2)#WhichCMKilledHisUncle pic.twitter.com/CminHAPyKB
— Lokesh Nara (@naralokesh) April 6, 2021