విజయవాడ: ‘తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్… ’ అంటూ టీడీపీ లీడర్ లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ సర్కార్ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ‘అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు’ అంటూ ఎద్దేవాచేశారు.
ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా ! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే!! అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
తుగ్లక్ 2.0 @100 డేస్
తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్… అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు.— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 7, 2019