పచ్చ కామెర్ల ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదన్నారు నారా లోకేష్. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అరమవుతుందంటూ విమర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు దొరికాయి అని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు గారి మాజీ పిఎ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయి అని తప్పుడు ప్రచారం చేస్తూ వైకాపా నాయకులు శునకానందం పొందుతున్నారని విమర్శించారు.
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోందన్నారు. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపి కి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టిడిపి కి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమేనని ఎద్దేవా చేశారు. అయినా అలాంటి కోరికలు కూడా మాకు లేవని త్వేట్టెర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.